📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణతింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్

తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్

📰 Generate e-Paper Clip

తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్

  • ఏకగ్రీవంగా ఎన్నిక.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మహమ్మద్ హనీఫ్

పెద్దేముల్, ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని తింసాన్ పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చురుకైన కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తున్నామని అన్నారు. తింసాన్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమని, ఆయన ఆధ్వర్యంలో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహమ్మద్ హనీఫ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తింసాన్ పల్లి గ్రామ సర్పంచ్ గుడిసె చంద్రకళ శ్రీనివాస్, ఉప సర్పంచ్ పల్లె ముకుంద శ్రీనివాస్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.ఎల్లా రెడ్డి,మంబాపూర్ శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా, ఉప్పరి మల్లేషం, కే. గోపాల్, ఎండీ. రియాజ్, గాజీపూర్ నసీర్, గాజీపూర్ లాల్ రెడ్డి, ఈ.నారాయణ గౌడ్, తట్టేపల్లి జగన్, తట్టేపల్లి కే.నర్సింహులు, శ్రావణ్ కుమార్, హర్ష వర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కుర్వ శ్రీనివాస్, చంద్రశేఖర్, సాబెర్, సోహెల్, పడగాళ్ల రాజు, హన్మంతు, వీరా రెడ్డి, వెంకటయ్య, తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్దారం నాగేష్,బంటు భీమప్ప, బంటు సంజీవ్ కుమార్, పల్లె రవి, జోగు కృష్ణ,అలీ, రమేష్, మహేందర్, గుడిసె నర్సింహులు, ప్రశాంత్, పల్లె శ్రీనివాస్, గుడిసె శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ నాయకులు, తింసాన్ పల్లి గ్రామస్తులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular