📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రజల కోసం ప్రశ్నించే జర్నలిజం ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజల కోసం ప్రశ్నించే జర్నలిజం ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ప్రజల కోసం ప్రశ్నించే జర్నలిజం ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

 

శంకర్‌పల్లి, జనవరి 25(ప్రజాక్షేత్రం):ప్రజా సమస్యలను ప్రజల గొంతుకగా ప్రతిబింబిస్తూ నిరంతరం ప్రజాపక్ష పాత్ర పోషిస్తున్న ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను శంకర్‌పల్లిలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాక్షేత్రం ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంస్థకు చెందిన సంపాదకులు, రిపోర్టర్లు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే ప్రజాక్షేత్రం దినపత్రిక ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ సమస్యల నుంచి పట్టణ ప్రజల అవసరాల వరకూ అన్ని అంశాలపై నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ, ప్రజల హక్కుల కోసం పోరాడే దినపత్రికగా ప్రజాక్షేత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని నిజాయితీగల జర్నలిజంతో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమం అనంతరం సిబ్బంది పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్యాలెండర్ ప్రతులను పంపిణీ చేశారు. ఈ వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular