📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఉద్యోగంరైల్వేల్లో 22 వేల ఉద్యోగాలు

రైల్వేల్లో 22 వేల ఉద్యోగాలు

📰 Generate e-Paper Clip

రైల్వేల్లో 22 వేల ఉద్యోగాలు

 

దరఖాస్తు తేదీల్లో తాజాగా మార్పులు.

హైదరాబాద్ జనవరి 24(ప్రజాక్షేత్రం):రైల్వేల్లో దాదాపు 22 వేల లెవల్-1 గ్రూప్-డి ఉద్యోగాల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనను 2025 డిసెంబర్ 27 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించింది. అయితే.. ఆ ప్రకటనలోని కొన్ని విషయాలకు తాజాగా సవరణ జారీ చేసింది. దీని ప్రకారం.. ఆన్‌లైన్ అప్లికేషన్ 2026 జనవరి 31న ప్రారంభం కానుంది. దరఖాస్తులను మార్చి 2వ తేదీ లోపు సమర్పించొచ్చు. ఈ ఉద్యోగాలకు ప్రారంభ వేతనం రూ.18 వేలు. 2026 జనవరి 1 నాటికి వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఇస్తారు. టెన్త్, ఐటీఐ చదివినవారు అర్హులు. అసిస్టెంట్(ట్రాక్ మెషిన్) 600, అసిస్టెంట్ (బ్రిడ్జ్) 600, ట్రాక్ మెయిన్‌టెయినర్(గ్రూప్ 4) 11000, అసిస్టెంట్(పి వే) 300, అసిస్టెంట్(టీఆర్డీ) 800, అసిస్టెంట్ లోకో షెడ్(ఎలక్ట్రికల్) 200, అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్) 500, అసిస్టెంట్(టీఎల్ అండ్ ఏసీ) 50, అసిస్టెంట్(సీ అండ్ డబ్ల్యూ) 1000, పాయింట్స్‌మ్యాన్-బీ 5000, అసిస్టెంట్(ఎస్ అండ్ టీ) 1500 ఖాళీలు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular