📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeహెల్త్&ఫిట్నెస్ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!

ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!

📰 Generate e-Paper Clip

ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!

ప్రజాక్షేత్రం డెస్క్: వేసవి వచ్చేస్తుంది. ఈ కాలంలో ఆకుపచ్చ, నల్ల ద్రాక్షలు మార్కెట్లో పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఈ ద్రాక్షపై హానికరమైన రసాయనాలు ఉంటాయని మీకు తెలుసా?దిగుబడిని పెంచడానికి, కీటకాల నుంచి పంటను కాపాడటానికి ఉపయోగించే పురుగుమందులు మార్కెట్లో కొనే ద్రాక్షపై కూడా దండిగా ఉంటాయి. ద్రాక్షను నీటితో కడగడం ద్వారా వీటిని సురక్షితంగా తొలగించవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ద్రాక్షలు సన్నని తొక్కలను కలిగి ఉంటాయి. ఇవి గుత్తులుగా ఉంటాయి. దీంతో వాటిపై చల్లిన పురుగుమందులు ఖాళీలలో పేరుకుపోతాయి. ఆహార భద్రతా సంస్థల అధ్యయనాలు మార్కెట్లో అమ్మకానికి ఉన్న ద్రాక్షపై కూడా పురుగుమందులు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు చూపించాయి. అంటే మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే ఇష్టమని ఈ పండ్లను నేరుగా తినకూడదన్నమాట. జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని కేవలం కుళాయి నీటిలో కడగడం వల్ల అన్ని రసాయనాలు తొలగిపోవు. ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి ద్రాక్షను 15-20 నిమిషాలు అందులో నానబెట్టాలి. ఇది ద్రాక్షకు అంటుకున్న బ్యాక్టీరియా, రసాయనాలను బలహీనపరుస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిలో పండ్లు, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల పురుగుమందుల పొరలు విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుందని వివిధ ఆహార అధ్యయనాలు చూపిస్తున్నాయి. ద్రాక్షను గెల నుంచి వేరు చేసి వాటిని 2-3 సార్లు శుభ్రమైన నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల ఖాళీలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో తుడవడం వల్ల అదనపు తేమ తొలగిపోతుంది. చాలా మంది పండ్లను నేరుగా రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. కానీ వాటిని కడగకుండా రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే రసాయనాలు మరింత వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేయడం మంచిది. పిల్లలు, వృద్ధులు, రోగులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login