📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు..

ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు..

📰 Generate e-Paper Clip

ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు..

  • అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు

హైదరాబాద్, మార్చి 29(ప్రజాక్షేత్రం):మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు, వివాదాలు లేకుండా ప్రభుత్వం ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాని’కి సవర ణను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి ‘తెలంగాణ పంచాయతీరాజ్(మూడవ సవరణ) బిల్లు-2026’ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలను ప్రతి 3నెలల కోసారి ఏడాదిలో 4సార్లు సవరిస్తుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు సవరించే తాజా జాబితాలనే పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రా ల్లోని పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వ హించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాల సవరణల సందర్భంగా ఒక కటాఫ్ డేట్ను నిర్దేశించి, ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి ‘తప్పనిసరి’గా అవకాశ మివ్వాలి. అలా కటాఫ్ డేట్ పెట్టకుండా సవరణలను చేపట్టినట్లయితే ఓటర్లు తమకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదంటూ కోర్టులకు వెళ్లే అవకాశాలు ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నాయి. ఫిర్యాదుదారు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కోర్టులు ఎన్నికలను నిలిపివేయవచ్చు. ఇలాంటి ఆటంకాలు, కోర్టు వివాదాలు తలెత్తకుండా ఉండడానికి వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొస్తోంది. ఓటర్ల దరఖాస్తులు, విజ్ఞప్తులతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలను నిర్వహించుకునేలా సవరణ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular