📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా

మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా

📰 Generate e-Paper Clip

మీసేవ కేంద్రాలపై ఎసిబి కొరడా

హైదరాబాద్ ఏప్రిల్ 15(ప్రజాక్షేత్రం):మీ సేవా కేంద్రాలపై ఎసిబి కొరడా ఝళిపించింది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అవి నీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహిం చారు. పౌర సేవా సర్టిఫికెట్లు జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం. అయితే, సాధారణ ప్రజలకు అందాల్సిన సేవలను అడ్డుకుంటూ, మీసేవ సిబ్బంది దళారుల ద్వారా చక్రం తిప్పుతున్నట్లుగా ఎసిబి ప్రాథమికంగా గుర్తిం చింది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తూ ఇక నేరుగా వచ్చే సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా సమాచారం. సోదాల సమయంలో మీసేవ కార్యాలయాల్లోని నగదు నిల్వలు, దరఖాస్తుల పెండింగ్ జాబితా, సిబ్బంది వ్యక్తిగత వివరాలను ఎసిబి బృందాలు పరిశీలించాయి. మరోవైపు మీ సేవ కేంద్రాల్లో దోపీడి ఎక్కువైపోయిందని ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీల పేరుతో మీసేవ సిబ్బంది చేస్తోన్న దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని జనం ఆరోపిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వెళ్తే దోచుకుంటున్నారు. టెక్నాలజీతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్నా మంటూ అన్ని సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగించి అధికారులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిర్వాహకులు అందినకాడి కి దండుకుంటున్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువీకరణ, ఒబిసి తదితర సర్టిఫికెట్ల కోసం రూ. 45 చెల్లిస్తే చాలు. కానీ, ఈ ఫీజు ఎక్కడా తీసుకోవడం లేదు. దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే, అక్రమ వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login