రోడ్డు ప్రమాదాల నివారించాలి
- ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- మంథని సీఐ బొల్లా పల్లి రాజు గౌడ్
- డ్రైవర్లు కంటి పరీక్షలు కు సహకరించాలి
గోదావరిఖని ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం):రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పన్నూరు గ్రామ పరిధి లో సాయిరాం గార్డెన్ ఆవరణ లో ఏర్పాటు చేసిన అలైవ్, అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా మండలంలోని సుమారు 40 మంది ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు డ్రైవర్ ల కు కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా మంథని సీఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో కంటి చూపు ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా కాపాడవచ్చని పేర్కొన్నారు. కంటి వైద్య శిబిరం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు రహదారి భద్రతపై అవగాహన తో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించ వచ్చు అని, ప్రతి వాహనదారుడు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం సురక్షిత ప్రయాణం కోసం రహదారులను నిర్మించినప్పటికీ, జాగ్రత్త గా వాహనాలు నడపాలని సూచించారు. ఆటో డ్రైవర్లతో పాటు ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రామగిరి ఎస్సై 2 దివ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

