సిసి రోడ్ల నిర్మాణం పనులపై ఆరోపణలు సరైనది కాదు..
- నిబంధనల ప్రకారమే సిసి రోడ్ల నిర్మాణాలు..
- విలేకరుల సమావేశంలో ఉల్లంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు…
చిగురుమామిడి, ఏప్రిల్ 16 (ప్రజాక్షేత్రం):మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నిబంధనల ప్రకారం, నాణ్యత ప్రమాణాలతోనే సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని,కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్, ఉపసర్పంచ్ కానవేని జితేందర్,వార్డు సభ్యులు కోల రజిత చంద్రమోహన్,కొత్త మధు,సుధగోని రమాదేవి,కోల ప్రభాకర్ లు తెలిపారు.గురువారం సర్పంచ్, ఉపసర్పంచ్ పలువురు వార్డు సభ్యులు సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డు సభ్యులు సయ్యద్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా కనీస అవగాహన లేకుండా అర్థరహిత ఆరోపణలు చేయడం బాధాకరమని ఆరోపించారు.ఒక బాధ్యత గల వార్డు సభ్యుడిగా ఉండి,గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలే తప్ప,అభివృద్ధిని ఓర్వక ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు సిసి రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో రాకుండా పనులు పర్యవేక్షణ చేయకుండా నిర్మాణం చేపట్టిన 11రోజుల తర్వాత వచ్చే అసత్యపు ఆరోపణలు చేయడం గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని వారు చెప్పారు.

