📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి పలువురికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి పలువురికి గాయాలు

📰 Generate e-Paper Clip

ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి పలువురికి గాయాలు

  • సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి మే 06(ప్రజాక్షేత్రం):లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగోప్లాపూర్ రాయచూర్ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర హైదరాబాద్ నుండి సిందనూర్ కు ట్రాన్స్పోర్ట్ లోడుతో వెళ్తున్న డీసీఎంను రాయచూరు వైపు వెళ్తున్న లారీ డీసీఎంను అతివేగంగా వెనుక నుంచి ఢీకొనడంతో రైయిచూర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న పెళ్లి బస్సు ను ఎదురుగా ఢీకొంది. దీనితో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, డీసీఎం డ్రైవర్ కు గాయాలయ్యాయి. లారీ డీసీఎం వాహనాలు రోడ్డుపై బోల్తాపడ్డాయి లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో లారీలో ఇరుక్కుపోయాడు. వెంటనే స్పందించిన దేవరకద్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీలో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ను బయటకు తీసి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

అదే సమయం లో మక్తల్ కి వెళ్తున్న పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంఘటన స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular