📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణబిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!

బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్!

హైదరాబాద్ మే 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాజకీయా ల్లో మరో కీలక పరిణా మం చోటుచేసుకుంది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ కీలక నేత బాల్కసుమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజు ల క్రితం సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకు న్నారు. ప్రస్తుతం పోలీ సులు బాల్క సుమన్‌ ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతి రేకంగా కార్యకర్తలం దరూ మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని ఆయన పిలుపుని చ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య లు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధా రంగానే పోలీసులు ఈ రోజు ఆయనను అదు పులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు.మరోవైపు తన అరెస్ట్ వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular