📄 ePaper
Saturday, May 23, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య

📰 Generate e-Paper Clip

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళల హత్య

  • అప్పుల వివాదమే కారణమా..?
  • తాండూరు నుంచి తీసుకెళ్లి హత్య చేసి పూడ్చిపెట్టిన దుండగులు

మొయినాబాద్, మే 16(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ దగ్గర ఇద్దరు వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతులు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలుగా గుర్తించారు. ఇటీవల తాండూరులో మిస్సింగ్ అయిన ఈ ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్ వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుల వ్యవహారంలో తలెత్తిన వివాదాలే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఘటనకు సంబంధించి పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login