📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeరాజకీయంఆర్మూర్ బీజేపీ లో గ్రూప్ వార్ రాజకీయాలు

ఆర్మూర్ బీజేపీ లో గ్రూప్ వార్ రాజకీయాలు

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ బీజేపీ లో గ్రూప్ వార్ రాజకీయాలు

  • ఎమ్మెల్యే అనుచరుడు పై నాయకుల అసంతృప్తి

నిజామాబాదు జూన్ 14(ప్రజాక్షేత్రం):బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం చూస్తున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో బిజెపి గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఎంపీ అరవింద్ సమక్షంలో బిజెపి బలపడుతుందని ఊహించుకోవడం జరిగింది. ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 30 వేల మెజార్టీతో గెలిచి తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే వ్యవహార శైలి లో తన అనుచరుడు అధిక జోక్యంతో నియోజకవర్గ నాయకులు దూరం అయినారు అని ఎంపీ అరవిందుకు పలుమార్లు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే రాజకీయ వ్యవహార శైలి కూడా మార్పు లేదని ప్రజలకు ఎమ్మెల్యేకు దూరం పెరుగుతుందని. అధికారులతో మాట్లాడే విధానం కానీ నచ్చడం లేదని ఏదైనా ఉంటే కొంతమేర మాట్లాడి పనులు చేయించుకోవాలని ప్రతి ఒక్కటి సాగదీత వ్యవహరంగా ఉందని, ఉపాధి అని చెప్పి ఒక్కొక్కరిని దూరం పెడుతున్నట్లు తెలిసింది, ఇటీవల నియోజకవర్గ ఉపసర్పంచులు ఎమ్మెల్యే కలవడానికి వస్తే రెండు గంటల పాటు వారికి విసుగు వచ్చేలా మాట్లాడి ఇబ్బంది చేశాడని అసలు ఎమ్మెల్యే వ్యవహార శైలి అర్థం కాక ఎమ్మెల్యే తో ఉన్న అనుచరులు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారని, అధికారులతో రివ్యూ అని చెప్పి ఏకధాటిగా ఎమ్మెల్యే మాట్లాడి అధికారులు ఏమి చెప్పక కేవలం కుర్చీలకే పరిమితం అవుతున్నారని ఎమ్మెల్యే ఇకనైనా తన వ్యవహర శైలి మార్చుకుంటే నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి కృషి చేసినట్లు అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇకనైనా చూడాలి ఎమ్మెల్యే తన వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా అని చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular