📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో ముగ్గురికి రిమాండ్

జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో ముగ్గురికి రిమాండ్

📰 Generate e-Paper Clip

జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసులో ముగ్గురికి రిమాండ్

శంకర్ పల్లి జూన్ 29(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఇటీవల జరిగిన దంపతుల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతుడు బాలసాయి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు ప్రకారం, మృతురాలు పద్మ తండ్రి చంద్రయ్య, తల్లి శాంతమ్మ, మరిది వెంకటేష్‌లు కలిసి జూలకల్ గ్రామంలోని తమ ఇంట్లో బంగారు నిధి ఉందని, దానిని వెలికితీయడానికి డబ్బులు అవసరమని నమ్మించి మృతుడు బాలసాయి వద్ద నుంచి అప్పుగా సుమారు రూ.10 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా వారు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలసాయి, పద్మ దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన విచారణ చేపట్టి నిందితులు చంద్రయ్య, శాంతమ్మ, వెంకటేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular