📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవివాహిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

కుషాయిగూడ, జూన్ 13(ప్రజాక్షేత్రం):కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధరావత్ సక్రి శనివారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె కుమార్తె ధరావత్ ప్రవళిక (26) 2022లో పరికల మల్లికార్జున్‌ను ప్రేమ వివాహం చేసుకుని చక్రిపురం ప్రాంతంలో నివాసముంటోంది. గైనకాలజికల్ ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె చికిత్స పొందుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 12న సాయంత్రం మల్లికార్జున్ ఫోన్ చేసి, ప్రవళిక తన చేయి కోసుకుని అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపి, మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకుని మల్లికార్జున్‌ను ప్రశ్నించగా, తన భార్య మృతికి ఓ డ్రైవర్ కారణమై ఉండవచ్చని అతను అనుమానం వ్యక్తం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular