స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం..!
అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన నరవ రమాకాంత్ రెడ్డి.!
ఎంపీడీవో ప్రభావతి దేవి, ఈ వో ఆర్ డి జయరాముడు.!
పెద్దకడబూర్ జూన్ 20(ప్రజాక్షేత్రం):పెద్దకడబూరు మండల పరిధిలోని స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలని టిడిపి రాష్ట్ర రైతు విభాగం ప్రతినిధి నరవరామాకాంత్ రెడ్డి ఎంపీడీ వో ప్రభావతి దేవి, ఈ ఆర్ డి ఓ జయరాముడు, శనివారం ఎంపీడీవో ఆఫీస్ పక్కన అంగన్వాడి సెంటర్ ముందు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభ్రత పై ప్రతి ఒక్కరు లోను మార్పు రావాలన్నారు పారిశుద్ధ్యం స్వేచ్ఛత అవినీతి నిర్మూలన లో అధికారులు ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు, శుభ్రత మీద ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలన్నదే స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం మాన్నారు, ప్లాస్టిక్ డే ప్రతి ఇంట పరిశ్రమలో వాడకుండా చూడాలన్నారు ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు, ప్రతి ఇంటికి చెత్త శేఖర్ నా వాహనాలు వస్తున్నాయని వేరు చేసి వారికి ఇవ్వాలని తెలియజేశారు, ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు ప్రభుత్వం చేపడుతుందన్నారు, అలాగే అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం పారిశుద్ధ్య నిర్వహణ మౌలిక సదుపాయాలు పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు, అంగన్వాడి టీచర్లతో పాటు వారు కూడా అక్కడే భోజనం చేశారు, పిల్లలకు ఆరోగ్యం విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు, అంగన్వాడి సేవలో నాణ్యత గా అందించాలని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు, ఈ కార్యక్రమంలో, టిడిపి నాయకులు మల్లికార్జున, అంగన్వాడి టీచర్లు జయమ్మ, చిట్టెమ్మ, ఆదిలక్ష్మి ,వెంకటలక్ష్మి, అయ్యమ్మ, అంగన్వాడి స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు

