ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక స్థలం కబ్జా అడ్డుకున్న బీరంగూడ గ్రామస్తులు
సంగారెడ్డి జూన్ 20(ప్రజాక్షేత్రం):బీరంగూడ గుట్టకమాన్ ప్రాంతంలో బీరంగూడ కమ్యూనిటీ హల్ పక్కన దాదాపు 1500 గజాల ప్రభుత్వ స్థలం స్మశాన వాటిక స్థలం విలువ దాదాపు 10 కోట్లు స్థలం తప్పుడు డాకుమెంట్లతో కబ్జా చేయడానికి ప్రయత్నించినా వారిని అడ్డుకొని రెవిన్యూ మరియు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన బీరంగూడ గ్రామస్తులు. ఈసందర్బంగా గ్రామస్తులు గ్రామ కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా కబ్జాదారులపై కబ్జాలు చేయడం మానుకోవాలని లేకుంటే తాగిన శాస్త్రి చెబుతామణి తెలిపారు. తప్పుదు డాకుమెంట్లతో కబ్జాకు ప్రయత్నం చేసిన మల్లేష్ దేవేందర్ శ్రీనివాస్ లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈసందర్బంగా హైద్రా మరియు రెవిన్యూ అధికారులు గ్రామస్తులకు న్యాయం చేస్తామని ఆందోళన చెందావద్దని తెలిపారు.ఈసందర్బంగా బీరంగూడ గ్రామ అధ్యక్షులు అడెల్లి రవీందర్ గ్రామ పెద్దలు మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ప్రకాష్ రెడ్డి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తప్పుడు డాకుమెంట్లతో బుకబ్జాకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని హైద్రా అధికారులకు రెవిన్యూ అధికారులకు విన్నవించారు ఎట్టి పరిస్థితుల్లో బుకబ్జా అడ్డుకొని తీరుతామణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీరంగూడ గ్రామ అధ్యక్షులు అడెల్లి రవీందర్ ఎడ్ల రమేష్ ప్రకాష్ రెడ్డి రమేష్ గౌడ్ మాకంమల్లేష్ పిర్జపతి సత్యనారాయణ నక్కల కిష్టయ్య చిన్న వీరేష్ పెద్ద వీరేష్ బంటు ప్రవీణ్ శివ ఎడ్ల అశోక్ సారా నవీన్ మాకం బిక్షపతి కుత్తడి ప్రభాకర్ పెద్ద ఎత్తున బీరంగూడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

