📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

📰 Generate e-Paper Clip

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ జులై 20(ప్రజాక్షేత్రం):ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో, అధికార యంత్రాంగం ఉదయ్ కృష్ణారెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య, “తన తప్పేమీ లేదని” పేర్కొంటూ ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు, సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular