నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి
షాబాద్ (ప్రజాక్షేత్రం):షాబాద్లో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్లలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ డెడ్ బాడీ రాజ్ కుమార్దే అని నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా మరేదైనా కారణంతో చనిపోయాడా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

