📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రేపు కుషాయిగూడ డిపోలో 'డయల్ యువర్ డీఎం'

రేపు కుషాయిగూడ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’

📰 Generate e-Paper Clip

మీ సమస్య చెప్పండి.. ఆర్టీసీ స్పందిస్తుంది

కుషాయిగూడ, జూలై 13(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో జూలై 14న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ తెలిపారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో కుషాయిగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సూచనలతో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు 7382826145 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని డిపో మేనేజర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular