📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణపెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్

పెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్

📰 Generate e-Paper Clip

పెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్

పెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్

– తాండూరు సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు

– నేడు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత

పెద్దేముల్ జూలై 19(ప్రజాక్షేత్రం):తాండూరు సబ్-డివిజన్ పరిధిలోని 220/132 కేవీ తాండూరు సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు (సోమవారం) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తాండూరు ఏడీఈ (ఆపరేషన్) కె.శంకర్ తెలిపారు.ఈ విద్యుత్ అంతరాయం పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్, తాండూరు రూరల్ సెక్షన్ల పరిధిలోని గ్రామాలకు వర్తిస్తుందని వెల్లడించారు.నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నందున వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల కలిగే అసౌకర్యాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular