📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణకుషాయిగూడ మార్కెట్లో అంగరంగ వైభవంగా బోనాలు

కుషాయిగూడ మార్కెట్లో అంగరంగ వైభవంగా బోనాలు

📰 Generate e-Paper Clip

కుషాయిగూడ మార్కెట్లో అంగరంగ వైభవంగా బోనాలుకుషాయిగూడ మార్కెట్లో అంగరంగ వైభవంగా బోనాలు

కుషాయిగూడ, ఆగస్టు 23(ప్రజా క్షేత్రం): కుషాయిగూడ కూరగాయల మార్కెట్‌లో బోనాల పండుగ వేడుకలను మార్కెట్‌ కమిటీ సభ్యులు, వ్యాపారులు ఘనంగా నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ ఆహ్వానం మేరకు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌ అతిథిగా, కుషాయిగూడ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కౌకుట్ల ప్రకాష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాల సమర్పణలో పాల్గొన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు విఠల్‌ నాయక్‌ తెలిపారు. మార్కెట్‌ కమిటీ సభ్యులు, వ్యాపారులు ఐకమత్యంతో బోనాల వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు, వ్యాపారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular