📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణగ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుంది

గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుంది

📰 Generate e-Paper Clip

గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుంది

  • మహనీయుల త్యాగాల వల్లే దేశానికి స్వతంత్రం
  • గుంజెటి గ్రామంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ దేశెట్టి పాటిల్

జహిరాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):మహనీయుల త్యాగాల వల్లే దేశానికి స్వతంత్రం వచ్చిందని, 1757 సం రంలో ఇస్ట్ ఇండియా కంపెనీ వారి రాకతో దేశంలో బ్రిటిష్ వారు మన దేశంలో పాలనా సాగించారాని, 1947 సం రంలో చేసిన కఠిన పోరాటంతోనే దేశానికి స్వతంత్రం సాధ్యమైందని గుంజెటి గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ అన్నారు. శనివారం నాడు న్యాల్కల్ మండలంలోని గుంజెటి గ్రామంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహసంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కార్యాలయం ఆవరణలో సర్పంచ్ జాతీయ జెండాను ఎగురావేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అయన మాట్లాడుతూ త్యాగాల పునాదుల మీదనే మన దేశానికి స్వతంత్రం సాధ్యమైందని, ఎందరో ప్రాణాల అర్పణ ఫలితమే ఇది, గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని, గుంజెటి గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తుల సహకారంతో ముందుకు వెళ్తామని, ఈ సందర్బంగా గ్రామ, మండలం, నియోజకవర్గ ప్రజలకు సర్పంచ్ దేశెట్టి పాటిల్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుంజెటి పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ అలిగే జీవన్, వార్డు సభ్యులు బొమ్మ మానేన్న, బండి నర్సింలు, శివన్న, ప్రభాకర్ పాటిల్, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular