విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితిసెందుకే మెరిట్ అవార్డులు
- విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిషత్తు
- కెనరా బ్యాంకు మేనేజర్ పృద్విరాజ్
- ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థులకు కెనరా బ్యాంకు తరపున నగదు ప్రోత్సాహం అందజేత
జహిరాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):ప్రపంచంలోనే గర్వించదగ్గ ఆవిష్కరణలు మన దేశ విద్యార్థుల ద్వారా అవుతున్నాయని, దేశ స్వతంత్రం నాటి నుంచి నేటివరకు మన దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని కెనరా బ్యాంకు మేనేజర్ పృద్విరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా శాసన సభ పరిధి మండలంలోని శేఖపూర్ గ్రామంలో దేశ 80 వ స్వతంత్ర దినోత్సన్ని పురస్కరించుకొని గ్రామంలోనీ జడ్పిహెచ్ఎస్ లో హెచ్ఏం సంగయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక బ్యాంకు మేనేజర్ పృద్విరాజ్, సర్పంచ్ మొహమ్మద్ చేష్మొద్దీన్ ముఖ్య అతిధులుగా హాజరై ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థులకు కెనరా బ్యాంకు తరపున నగదు పురస్కారాన్ని అందజేసి వచ్చే ఏడాది కూడా శేఖపూర్ గ్రామ పాఠశాల విద్యార్థులకే అవార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ చేష్మొద్దీన్ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన ఎసేస్సి పరీక్షల్లో మన శేఖపూర్ గ్రామ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయం అని, అదే విధంగా కెనరా బ్యాంకు వారు ఎస్సీ, ఎస్టీ మెరిట్ విద్యార్థులకు 5 వెయ్యిల చొప్పున రివార్డులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ కెనరా బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ అజయ్ విశ్వకర్మ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ అజయ్ విశ్వకర్మ, సర్పంచ్ చేష్మొద్దీన్, హెచ్ఏం సంగయ్య, బ్యాంకు అధికారి మొహమ్మద్ తాజుద్దీన్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సుజాత, వార్డు సభ్యులు గొటటి చంటి, మొహమ్మద్ నాయిం, ప్రతినిధి మొహమ్మద్ సైఫ్, సీనియర్ నాయకులు నారాయణ్ గౌడ్, మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ అబ్దుల్ రావుఫ్, షేక్ అలీ, బ్యాంకు మిత్ర మొహమ్మద్ ఫయాజ్, సిఏ లు అబ్దుల్ మజీద్, చందర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

