📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణదొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు

దొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు

📰 Generate e-Paper Clip

దొంగతనానికి యత్నించిన నిందితుడి అరెస్టు

శంకర్‌పల్లి ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించిన నిందితుడిని అరెస్టు చేసి 14 రోజులపాటు రిమాండ్ తరలించారు. ఎస్త్స్ర సురేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎల్బీనగర్, ఫతేనగర్ హైదరాబాద్ చెందిన నింధితుడు వేముల నరసింహ (చీమ కండ్ల నరసింహ) మద్యం, సిగరెట్లకు బానిసై దొంగతనాలు చేయడం మొదలు పెట్టడం తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలోని వివిధ ప్రాంతాలను తిరుగుతూ దొంగతనానికి అనువైన ఇంటి కోసం వెతికాడని తెలిపారు. పట్టణంలోని బ్లూవుడ్స్ వెంచర్లు లో ఉన్న ఇంటిని గమనించి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని, అదే సరైన సమయంగా భావించి తన వెంట తీసుకువచ్చిన ఇనుప రాడ్డుతో ఇంటి తాళం పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా చుట్టుపక్కల వారికి శబ్దాలు రావడంతో నిందితుడిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి ఒక ఇనుప రాడ్డు, మొబైల్ ఫోను సీజ్ చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి 14 రోజులపాటు రిమాండ్ కు పంపడం జరిగిందని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular