📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణపరిశ్రమికంగా అభివృద్ధి చెందుతున్న జహిరాబాద్ మీదుగా పెట్టాలి

పరిశ్రమికంగా అభివృద్ధి చెందుతున్న జహిరాబాద్ మీదుగా పెట్టాలి

📰 Generate e-Paper Clip

పరిశ్రమికంగా అభివృద్ధి చెందుతున్న జహిరాబాద్ మీదుగా పెట్టాలి

వ్యాపార వర్గాలకు జహిరాబాద్ స్వర్గదామం : కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ ఖదీర్

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చెయ్యాలి


జహిరాబాద ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ముంబై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను జహీరాబాద్ మీదుగా అలైన్‌మెంట్ చేయాలని, నిమ్జ్ పరిశ్రమల రాకతో జహిరాబాద్ ప్రాంతానికి జాతీయంగా ఎంతో పేరు వచ్చిందని కాంగ్రెస్ కౌన్సిలర్ ఖదీర్ భాయ్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ న్యాల్కల్, ఝరాసంగం మండలంలోని 13 గ్రామాల్లో సుమారు 12600 ఎకరాలకుపైగా భువిస్తీరణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వస్తున్నందున జహిరాబాద్ వాణిజ్య కేంద్రానికి నిలయంగా మారడంతో పాటు పరిశ్రమికంగా అభివృద్ధి చెందిన ముంబై, వైజాగ్, చెన్నై, బెంగళూర్, నాసిక్, పూణే లాంటి అంతర్జాతీయ స్థాయి గల నగరాల నుంచి జహిరాబాద్ ప్రాంతానికి వ్యాపారావేత్తలు రాకపోకలు అధికంగా సాగి జహిరాబాద్ కు మరింత విస్తృతమైన పేరుతో పాటు వ్యాపారం పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జహీరాబాద్ మీదుగా సాకారమైతే ఈ ప్రాంతంలో రవాణా మరియు లాజిస్టిక్స్ సౌకర్యాలు అద్భుతంగా మెరుగవుతాయని మహమ్మద్ ఖదీర్ భాయ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular