📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రజాసేవకు ముందు పరిశుభ్రత…జగద్గిరిగుట్ట పోలీసుల సందేశం

ప్రజాసేవకు ముందు పరిశుభ్రత…జగద్గిరిగుట్ట పోలీసుల సందేశం

📰 Generate e-Paper Clip

ప్రజాసేవకు ముందు పరిశుభ్రత…జగద్గిరిగుట్ట పోలీసుల సందేశం

  • ఎస్‌హెచ్‌వో ఎన్. సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం
  • ఖాకీ చెబుతున్న సందేశం…’శుభ్రతే బాధ్యత’

కుత్బుల్లాపూర్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):నేరాల నియంత్రణ, ప్రజల భద్రతతో పాటు పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం కూడా ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందనే సందేశంతో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో శనివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి స్టేషన్‌లోని అన్ని గదులు, క్యాబిన్లు, రికార్డు విభాగాలు, ప్రజలు వేచి ఉండే ప్రదేశాలు, ఆవరణను పూర్తిగా శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చెత్త, దుమ్మును తొలగించి స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాలు ఆదర్శవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌హెచ్‌వో ఎన్. సురేష్ మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని, ప్రతి ఉద్యోగి తన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా భావించాలని అన్నారు. శుభ్రమైన వాతావరణం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజల్లో విశ్వాసాన్ని కూడా బలోపేతం చేస్తుందన్నారు. పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని స్టేషన్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం స్థానికుల ప్రశంసలు అందుకుంది. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular