రాఖీ బంధం.. ఆప్యాయతల వెల్లువ
- సోదరీమణుల చేత రాఖీ కట్టించుకున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):రాఖీ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం సోదరీమణులైన సుదర్శనమ్మ, బాలకిష్టమ్మల చేత రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆశీర్వాదాలు అందుకున్నారు. రాఖీ పండుగ ప్రేమ, నమ్మకం, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు ఎల్లప్పుడూ రక్షగా నిలవాలని ఆకాంక్షించారు. నూతన వధూవరులకు ఆశీస్సులు
వివాహ రిసెప్షన్‌కు హాజరైన నిరంజన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వనపర్తి మండలం చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తండు చెన్నారెడ్డి–సుజాత దంపతుల కుమారుడు వంశీకుమార్‌రెడ్డి, భువికరెడ్డి వివాహ రిసెప్షన్ వనపర్తిలోని ఆర్జీ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించి నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ఉళ్లం తిరుమల్, నాగన్న యాదవ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ధర్మనాయక్, మాధవరెడ్డి, చిట్యాల రాము, బాబు నాయక్, శ్యామలాలు యాదవ్, తోట శీను తదితరులు పాల్గొన్నారు.
మాజీ కౌన్సిలర్ సమద్ కుటుంబానికి పరామర్శ
రిహానా బేగం మృతికి నిరంజన్‌రెడ్డి సంతాపం
వనపర్తి పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ సమద్ మాతృమూర్తి రిహానా బేగం అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, గులాం ఖాదర్‌ఖాన్, జోహెబ్ హుస్సేన్, నాగన్న, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ధర్మనాయక్, నరసింహ, అస్లాం, ఫజల్, ఆరిఫ్, స్టార్ రహీం, ఏకే పాషా, అలీమ్, ఖలీమ్, మాలిక్, గౌస్, ఖాదర్, చిట్యాల రాము తదితరులు ఉన్నారు.


