📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణరాస్నం గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి.

రాస్నం గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి.

📰 Generate e-Paper Clip

రాస్నం గ్రామంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి.

గ్రామపెద్దలు, గౌడ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో,

యాలాల ఆగస్టు 18(ప్రజాక్షేతం): గెరిల్లా పోరాటంతో దళిత, బహుజనుల, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప యుద్ధ వీరుడు, నిరంకుశత్వం పై నిప్పుకణికలా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను యాలాల మండలం రాస్నం గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాస్నం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి గ్రామ పెద్దలు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు, సమాజంలో సమానత్వం కోసం ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ జనార్ధన్ రెడ్డి, ఎస్, వెంకట్ రెడ్డి, కె. బాబు, ఆర్.ఎం.పి డాక్టర్ అశోక్ కుమార్, ప్రవీణ్, నర్సింములు గౌడ్, మధు గౌడ్, సత్తయ్య గౌడ్, యాదయ్య గౌడ్, నందు గౌడ్ , గాండ్ల వీరణ్ణ, రాఘవేందర్ రెడ్డి, జి. శ్రీశైలం,ఆజం, మల్లేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular