📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవిద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

– పరిశుభ్రతతో పాటు విద్యార్థుల భద్రత ముఖ్యమే

– మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీవో

కోటగిరి,జులై01(ప్రజాక్షేత్రం): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పాటు ఉపాధ్యాయులకు కోటగిరి ఎంపీడీవో విష్ణు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ లో శనివారము స్థానిక సర్పంచ్ బర్ల మధుకర్ తో కలిసి ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్సీ బీసీ హాస్టల్ లను పరిశీలించిన ఎంపీడీవో బాత్రూంలు, కిచెన్లు, హాస్టల్ గదులు పరిశీలించి పలు సూచనలు చేశారు. హాస్టల్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో విష్ణు మాట్లాడుతూ… స్కూలు హాస్టల్లో ఉండే విద్యార్థుల పరిసరాల పరిశుభ్రతతో పాటు వారి భద్రత కూడా ముఖ్యమైనదని అన్నారు. హాస్టల్ స్కూల్ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటారని చెప్పారు. భోజనం విషయంలో రాజీ పడేది లేదని తాజా కూరగాయలు తెచ్చి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరావు, జిపి సెక్రెటరీ సందీప్,హాస్టల్ వార్డెన్ నరహరి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular