📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణసుజాతమ్మ సేవలు చిరస్మరణీయం

సుజాతమ్మ సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

సుజాతమ్మ సేవలు చిరస్మరణీయం

  • దశదినకర్మకు హాజరై నివాళులర్పించిన సింగిరెడ్డి వాసంతమ్మ,
  • మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌ తదితరులు

వనపర్తి, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):మాజీ కౌన్సిలర్‌ బండారు కృష్ణ సతీమణి, మాజీ కౌన్సిలర్‌ బండారు సుజాతమ్మ దశదినకర్మ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సుజాతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి వాసంతమ్మ మాట్లాడుతూ.. సుజాతమ్మను కోల్పోవడం వ్యక్తిగతంగా తమను ఎంతో కలచివేసిందన్నారు. ఆమె మృతి తమకు, పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. బండారు కృష్ణ, సుజాత దంపతులు పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుజాతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్‌, పెండం నాగన్న యాదవ్‌ తదితరులు సుజాతమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, డానియల్‌, నందిమల్ల రమేష్‌, మాజీ కౌన్సిలర్‌ నందిమల్ల శారద అశోక్‌, మహిళా నాయకురాలు కవితానాయక్‌, ఖాదర్‌, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular