📄 ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeతెలంగాణకొడంగల్ లో అడుగు పెడతా…రేవంత్ రెడ్డి భరతం పడతా

కొడంగల్ లో అడుగు పెడతా…రేవంత్ రెడ్డి భరతం పడతా

📰 Generate e-Paper Clip

కొడంగల్ లో అడుగు పెడతా…రేవంత్ రెడ్డి భరతం పడతా

  • బీసీలకు భూమి.. విద్య.. వైద్యం.. రాజకీయ అధికారం దక్కాల్సిందే
  • 80 ఏళ్లుగా అధికారం రెడ్డి, వెలమల చేతుల్లోనే..
  • తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుస్తాం
  • బీసీలకు రాజకీయ వాటా దక్కకుండా అడ్డుకున్నా రెడ్లు, వెలమలు
  • భూముల పంపిణీలో సామాజిక న్యాయం జరగాలి.. పేదలకు భూమి పంచుతాం
  • 2028లో బీసీ ముఖ్యమంత్రి చేసి తీరుతాం
  • పరిగి నుంచి వికారాబాద్ వరకు ఉత్సాహంగా సాగిన బీసీ రాజ్యాధికార యాత్ర
  • 122 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న మల్లన్న పాదయాత్ర

వికారాబాద్ సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణలో జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జనాభాకు తగిన రాజకీయ అధికారం, భూమి, నాణ్యమైన విద్య, వైద్యం అందాలన్న లక్ష్యంతోనే బీసీ రాజ్యాధికార యాత్ర చేపట్టినట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీల జీవితాల్లో మార్పు రావాలంటే రాజకీయ అధికారంలో వారి భాగస్వామ్యం పెరగాలని పేర్కొన్నారు.

బీసీ రాజ్యాధికార యాత్ర ఏడో రోజు పరిగి నుంచి వికారాబాద్ వైపు కొనసాగింది. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను కలుస్తూ సాగిన పాదయాత్ర 122 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. మార్గమధ్యంలో పాఠశాలలను సందర్శించిన మల్లన్న విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి సమస్యలు, పాఠశాలల్లోని వసతుల గురించి తెలుసుకున్నారు.

“భూమి.. చదువు.. వైద్యం.. అధికారం — బీసీలకు దక్కాలి”

వికారాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడుతూ బీసీ రాజ్యాధికార యాత్ర లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో పేద కుటుంబాలకు భూమి, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు అవసరమని అన్నారు.

రాష్ట్రంలో భూమి, సంపద, రాజకీయ అధికారం రెడ్డి,వెలమల సామాజిక వర్గాల వద్ద అసమానంగా కేంద్రీకృతమైందని మల్లన్న అన్నారు. ముఖ్యంగా రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన వారి వద్ద కోటి ఎకరాల భూమి ఉందని పేర్కొంటూ,భూమిలేని పేదలకు రేపటి బీసీ రాజ్యంలో భూ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు

“బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకే ఈ పాదయాత్ర”

కులగణనలో బీసీల లెక్కలు తప్పు ఉన్నాయ్ నిరసనగా ఆ పత్రాలను తగబెడితే బీసీల కోసం మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని రేవంత్ రెడ్డి నన్ను సస్పెండ్ చేశారని అన్నారు.
దశాబ్దాలుగా తెలంగాణలో బీసీలు జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికారంలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదని మల్లన్న అన్నారు.రాజకీయ పదవులు, భూములు, ఇతర వనరుల పంపిణీలో బీసీలకు తగిన వాటా దక్కలేదని, ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు కోరుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార పంపిణీ విషయానికి వచ్చేసరికి అదే స్థాయిలో అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.

రైతు రుణమాఫీ పేరుతో బీసీల పేరుమీద 9వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎంపీ గా పోటీ చేసిన రంజిత్ రెడ్డికి 5వేల కోట్ల మాఫీ చేశారని సంచలన విషయాన్ని వెల్లడించారు.ఇది ఎవని ప్రభుత్వం,ఎవని కోసం పని చేస్తున్న ప్రభుత్వమో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

ఈ ప్రాంతంలో ఎంపీ గా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండ వెంకట రంగ రెడ్డి నిజాం పేదలకు ఇచ్చిన భూముల కాగితాన్ని దాచిపెట్టి ఆ భూములను బీసీలకు,పేదలకు దక్కకుండా రెడ్లు,వెలమలకు అప్పగించాడని సంచలన విషయాన్ని బయటపెట్టారు.అదే 1954-55 కాస్ర పహాని అన్నారు, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 80 ఏండ్లు రెవెన్యూ శాఖ రెడ్ల దగ్గరే పెట్టుకున్నారని,భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయని అన్నారు.

“బీసీలు కేవలం ఓట్లు వేసే వర్గంగా మిగిలిపోకూడదు. నిర్ణయాలు తీసుకునే స్థానాల్లోకి రావాలి. మన పిల్లల భవిష్యత్తు, మన భూమి, మన విద్య, మన వైద్యం గురించి నిర్ణయించే రాజకీయ అధికారంలో మన వాటా ఉండాలి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే యాత్ర చేస్తున్నట్లు మల్లన్న పేర్కొన్నారు.

కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి ఏమో అన్నది అన్న విషయoలో బీసీ బిడ్డ కొండ సురేఖను సస్పెండ్ చేశారు….అదే దళిత వర్గాల నుండి ఉన్నత స్థానమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ ను కుటుంబం పేరుతో దూషించినందుకు వాళ్ల తలలు నరకాలి కదా అని మండిపడ్డారు

42 శాతం రిజర్వేషన్‌పై మల్లన్న విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఎదురైన అడ్డంకులను ప్రస్తావించిన మల్లన్న, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగకుండా కోర్టులో కేసు వేసి రెడ్లు అడ్డుపడ్డారని మండిపడ్డారు. బీసీలకు జనాభాకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు కల్పించాలని రెడ్లు అనుకోరని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బీసీలు తమ రాజకీయ హక్కుల కోసం సంఘటితంగా నిలబడాలని, తమ జనాభా బలాన్ని రాజకీయ నిర్ణయాధికారంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

“2028లో బీసీ ముఖ్యమంత్రి రావాలి”

తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నది తమ రాజకీయ లక్ష్యమని మల్లన్న చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

బీసీల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే కేవలం సంక్షేమ పథకాలు సరిపోవని, విధాన నిర్ణయాలు తీసుకునే రాజకీయ అధికారంలోనూ బీసీలకు భాగస్వామ్యం అవసరమని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

పాఠశాల పిల్లలతో మమేకమైన మల్లన్న

అంతకుముందు పరిగి నుంచి యాత్ర ప్రారంభించిన మల్లన్న మార్గమధ్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.

అనంతరం అభిమానులు, స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్రను కొనసాగించారు. మార్గమధ్యంలో ప్రజలతో కరచాలనం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు.

నస్కల్‌లో ఘన స్వాగతం

బీసీ రాజ్యాధికార యాత్ర నస్కల్‌కు చేరుకోగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్లన్నకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం నస్కల్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మల్లన్న పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ నస్కల్ నుంచి గోవిందపూర్ వైపు పాదయాత్ర కొనసాగించారు.

విద్యార్థిగా మారిన మల్లన్న

నస్కల్‌లోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మల్లన్న కొద్దిసేపు విద్యార్థులతో కలిసి బెంచ్‌పై కూర్చున్నారు. పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ వారి చదువు, పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న యూనిఫాం క్లాత్‌ను పరిశీలించి, దాని నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగారు. యూనిఫాం సౌకర్యంగా ఉందా, పాఠశాలలో అవసరమైన వసతులు అందుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులతో మాటామంతీ

నస్కల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కూడా మల్లన్న సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, భోజనం, హాస్టల్ వసతులు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు అందుతున్న భోజనం నాణ్యత, విద్యా సౌకర్యాలు, వసతి పరిస్థితులపై వారితో నేరుగా మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమై పాఠశాలలోని సమస్యలు, అవసరమైన మౌలిక వసతుల గురించి వివరాలు తెలుసుకున్నారు.

122 కిలోమీటర్లకు చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, భూమి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర ఏడో రోజు నాటికి 122 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

పరిగి నుంచి నస్కల్, గోవిందపూర్ మీదుగా వికారాబాద్ వైపు సాగిన యాత్రలో గ్రామగ్రామాన ప్రజలను కలుస్తూ మల్లన్న ముందుకు సాగారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై చర్చ జరగాలని, రాజకీయ అధికారంలో జనాభాకు తగిన ప్రాతినిధ్యం కోసం బీసీలు చైతన్యవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular