Homeతెలంగాణమాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు బయలుదేరిన శంకర్ పల్లి విద్యార్థి నాయకులు

మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు బయలుదేరిన శంకర్ పల్లి విద్యార్థి నాయకులు

📰 Generate e-Paper Clip

మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు బయలుదేరిన శంకర్ పల్లి విద్యార్థి నాయకులు

  • రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ
  • మండల అధ్యక్షులు లింగం సాయి కుమార్ మాదిగ
  • మున్సిపల్ అధ్యక్షులు కటికే మోహన్ మాదిగ.

శంకర్ పల్లి అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సభ కు శంకర్ పల్లి నుండి మాదిగ విద్యార్థి నాయకులు బయలుదేరారు. విద్యార్థుల విద్యా, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో విద్యార్థుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు నాయకులు తెలిపారు. బయలుదేరిన మాదిగ విద్యార్థి నాయకులు రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ శంకర్ పల్లి మండల అధ్యక్షులు లింగం సాయి మాదిగ, శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు కటికే మోహన్ లు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతూ, విద్యా రంగంలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి ప్రతినిధులతో జరిగే ఈ సదస్సు విద్యార్థి ఉద్యమానికి మరింత దిశానిర్దేశం చేయడంతో పాటు, తెలంగాణలో విద్యార్థుల సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. శంకర్ పల్లి మండల విద్యార్థి నాయకుల భాగస్వామ్యం విద్యార్థి ఉద్యమానికి నూతన ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శేరిగూడం అక్షయ్, జి. కిరణ్, అజయ్, రాహుల్, నవీన్, తేజస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular