రోస్టర్ పాయింట్ ల లో తేడా వస్తే రేవంత్ సర్కార్ తో యుద్ధమే.
- ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జనాభా ప్రకారం వాటా దక్కలేదు.
- ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి జనాభా దామాషా ప్రకారం మాదిగల వాటా 15% ఇవ్వాలి.
- కుల వివక్షత నిర్మూలన కోసం సామాజిక న్యాయం కోసం మాలలు కలిసి రావాలి.
- సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతల నిర్మూలన కోసం పోరాడుదాం.
- విద్యారంగ సమస్యలపై భవిష్యత్తు ఉద్యమాలు చేపడుదాం.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.
హైదరాబాద్ అక్టోబర్ 06(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ చట్టంలో రోస్టర్ పాయింట్లను సవరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తే వాటిని ఎదుర్కోవడానికి మాదిగ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి యుద్ధానికి సిద్ధమవుతామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు ఎంఎస్ఎఫ్ ప్రతినిధుల జాతీయ సదస్సు డా.సిహెచ్ సోమశేఖర్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన నాడే మాదిగలకు జనాభా ప్రాతిపదికన తగిన వాటా రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేయడం జరిగిందని అన్నారు. అసెంబ్లీలో 2026 జనాభా లెక్కలు వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతాం, ఆ ప్రకారం దామాష ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు పంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. నేడు ఆ హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమించడం, మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వర్గీకరణ చట్టం తీసుకురావడంతో ఆ కమిటీల ప్రక్రియ ముగిసింది అని అన్నారు. కానీ మళ్ళీ కొత్తగా రోస్టర్ సవరణ కోసం మాలలు ఒత్తిడికి తలొగ్గి రేవంత్ సర్కార్ కమిటీని పునర్నిర్మాణ చేయడం దారుణమని అన్నారు. ఈ కుట్రలు ఆపకపోతే రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఎస్సీ వర్గీకరణలో న్యాయమైన వాటా దక్కక నష్టపోయింది మాదిగలే అని అన్నారు. మాలలకు జనాభా మించి రిజర్వేషన్లు లభించి లబ్ధి పొందాలని అన్నారు. అయినప్పటికీ రోస్టర్ సవరణ పేరుతో కుట్రలు కుతంత్రాలు చేయడం తగదని అన్నారు. కుట్రలుమాని ఐక్య ఉద్యమాలు ముందుకు నడపడానికి కుల వివక్షత నిర్మూలన కోసం, సామాజిక న్యాయం కోసం మాలలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మాలల పట్ల సోదరత్వం, మానవత్వంతో ఎమ్మార్పీఎస్ వ్యవహరిస్తుందని అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులు పోషించిన పాత్ర చరిత్రాత్మకమైంది అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించిన విద్యార్థి లోకానికి అభినందనలు అనేక ఏండ్లు కుల వివక్షతను పేదరికాన్ని పేదరికాన్ని అనుభవించిన మాదిగలు కుల వివక్షత మతవేర్చత వివక్షత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అలాగే దేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను నిర్మూలించుకోవాల్సిన బాధ్యత మాదిగల మీదనే ఉందనన్నారు. అందుకోసం మాదిగలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మరియు అగ్రకులాల్లోని పేదలను కలుపుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని పిలిచారు పిలుపునిచ్చారు. ఇక పాలకులకు విద్యారంగా సంక్షేమ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి పాలకులు మారుతున్న కూడా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడం భారంగా మారిపోయిందని అన్నారు. విద్యా వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అలాగే ముఖ్యంగా అట్టడుగు కులాల విద్యార్థులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉన్న సంక్షేమ హాస్టలను సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసిందని అన్నారు కావున ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల విద్యార్థులకు కలుపుకొని విద్యారంగ సమస్యలు మరియు సంక్షేమ హాస్టల్లో సమస్యలు మరియు ఇతర సామాజిక సమస్యల మీద భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.



