📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణనాగారం–దమ్మాయిగూడ రోడ్డుపై ప్రజల ఆగ్రహం

నాగారం–దమ్మాయిగూడ రోడ్డుపై ప్రజల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

నాగారం–దమ్మాయిగూడ రోడ్డుపై ప్రజల ఆగ్రహం

నాగారం, జూన్ 20(ప్రజాక్షేత్రం):చిన్నపాటి వర్షానికే నాగారం–దమ్మాయిగూడ ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చెరువును తలపించేలా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటోందని, శాశ్వత పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజల సమస్యలను విస్మరించారని విమర్శిస్తున్నారు. రోడ్డుపై నిలిచిన నీటి కారణంగా గుంతలు కనిపించక ప్రమాదాల ముప్పు పెరిగిందని, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రయాణం కష్టంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వర్షాకాలం వస్తే రోడ్లు దయనీయ స్థితికి చేరుకోవడం అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంటున్నారు.
ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన నాగారం–దమ్మాయిగూడ రోడ్డుకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. “రోడ్డు కావాలి… చెరువు కాదు”, “హామీలు కాదు… పనులు కావాలి” అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. వర్షం వస్తే మునిగిపోయే రోడ్లు కాకుండా, భద్రంగా ప్రయాణించే రహదారులు కావాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular