విద్యార్థుల జీవితాలతో చెలగటమడుతున్న విద్యాశాఖ…?
నిర్మాణం పూర్తి కాకున్నా పాఠశాలకు అనుమతి ఇచ్చిన అధికారులు…!
పర్యవేక్షణ చేయకుండానే చక చక పర్మిషన్లకు మంజూరు చేసిన విద్యాశాఖ అధికారులు..
పత్రికల్లో వార్తలు వస్తే మాకేంటి భయం…! మా పని మేము చేశామని అంటున్న మండల విద్యాధికారి
నవాబ్‌పేటలో కలకలం రేపుతున్న ‘సంస్కృతి’ అక్రమ నిర్మాణం!
ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యావేత్తలు ”స్థానికులు
వికారాబాద్ బ్యూరో జూన్ 20 (ప్రజాక్షేత్రం)
అధికారుల అండదండలు ఉంటే చాలు …. అన్ని అనుమతులు అవే వస్తాయి… పాఠశాల ఏర్పాటు చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనం కానీ… స్థలం కానీ అసలు ఏం లేకున్నా అక్కడ పాఠశాల ఉన్నట్లు కాగితాలపై… అన్ని ఉన్నట్లు ఉన్నత అధికారులకు సిఫారసు చేయడంలో కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు… అందులో భాగమే నవాపేట మండల కేంద్రంలో ఏర్పాటైన సంస్కృతి పాఠశాల. ఆ పాఠశాల భవనం నిర్మాణం నేటికి పూర్తి కాలేదు… అంతేకాదు ఆ భవన నిర్మాణానికి అనుమతి లేదు.. అయినా మన విద్యాశాఖ అధికారులు ఆగ మేఘాల మీద అనుమతులు ఇచ్చి పాఠశాలనే ఏర్పాటు చేయించారు.. పాఠశాల ఏర్పాటు చేసిన తరువు కాకుండా ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేశారు. యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించకుండా సంపాదన ధ్యేయంగా వేల రూపాయలు కాదు లక్ష రూపాయల వసూలు చేస్తూ పాఠశాలలో జాయిన్ చేసుకుంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే భవనం ముందే పెట్రోల్ బంక్ ఉంది. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్ ఉన్న ప్రదేశంలో పాఠశాల అనుమతి ఇవ్వవచ్చా అన్న సందేహాన్ని స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారిని సంస్కృతి పాఠశాల గురించి సమాచారం మన కోరగా ”అన్ని అనుమతులు ఉన్నాయి.. ఇందులో ఆలోచించాల్సిందేముంది… మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోండి… మాకేంటి ”అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.. యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.. ఈ పాఠశాలపై పూర్తి కథనం
నవాబ్‌పేట మండలం ప్రధాన రహదారి పక్కనే నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ‘సంస్కృతి’ పాఠశాల భవన నిర్మాణం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భవనానికి పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే ఏకంగా నాలుగు అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నా, స్థానిక అధికారులు మాత్రం ఇన్నాళ్లూ కళ్ళుండీ చూడనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పత్రికల్లో వస్తేనే మేల్కొన్న అధికారులు!
గత రెండు రోజులుగా ఈ అక్రమ నిర్మాణంపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు పంచాయతీ యంత్రాంగం నిద్రమత్తు వీడింది. సదరు సంస్కృతి స్కూల్ బిల్డింగ్‌కు పూర్తి స్థాయిలో నిర్మాణ అనుమతులు లేవనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన చిట్టిగిద్ద గ్రామ పంచాయతీ సెక్రటరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
అయితే, ఈ నోటీసుల వ్యవహారంలో పారదర్శకత లోపించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసుకు సంబంధించిన కాపీని ఇవ్వాలని పత్రికా విలేఖరులు కోరగా, పంచాయతీ సెక్రటరీ సరైన సమాధానమే ఇవ్వకుండా కా సుబుస్సు అంటున్నారు.. “నోటీసు ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ ఆ కాపీని మీకు ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు. ఏమైనా ఉంటే మా పై అధికారులతో మాట్లాడుకోండి” అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అంతా ఒక్కటేనా..?
ప్రధాన రహదారి పక్కనే ఇంత పెద్ద భవనం వెలుస్తున్నా అధికారులు గుర్తించకపోవడం, తీరా పత్రికల్లో వార్తలు వచ్చాక నోటీసులు ఇచ్చి.. ఆ వివరాలు అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండా అధికారులు వివరించడం చూస్తుంటే ఇందులో ఇందులో ఎవరి పాత్ర ఏంటి… ఎవరు ఎలా వ్యవహరించారు… ఈ పాఠశాల భవన నిర్మాణం నుంచి పాఠశాల అనుమతి ఇప్పించేవరకు అధికారుల పాత్ర ఎంత ఉందో వారి మాటలు బట్టి ఇట్టే అర్థమవుతుంది. భవన నిర్మాణం పూర్తిస్థాయిలో లేదు ఇంకా భవన నిర్మాణం కొనసాగుతుంది అయినా స్కూలు పర్మిషన్ మాత్రం ఆగమేఘాలలో గత నెలలోనే ఎలా ఇచ్చారు విద్య అధికారుల పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్న స్థానికులు. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపి అవకాశం ఉందని విద్యావేత్తల ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రాణమైన సందర్భంగా అడ్మిషన్లు జరుగుతున్నందున విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



