📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణమహంకాళీ అమ్మ వారి పీర్లు రాజు స్వామి మరియు కౌన్సిలర్ ఖదీర్ భాయ్ ఆధ్వర్యం లో...

మహంకాళీ అమ్మ వారి పీర్లు రాజు స్వామి మరియు కౌన్సిలర్ ఖదీర్ భాయ్ ఆధ్వర్యం లో కులమతలకు అతితంగా హాజరైన భక్తులు

📰 Generate e-Paper Clip

మహంకాళీ అమ్మ వారి పీర్లు రాజు స్వామి మరియు కౌన్సిలర్ ఖదీర్ భాయ్ ఆధ్వర్యం లో కులమతలకు అతితంగా హాజరైన భక్తులు

జహీరాబాద్, జూన్ 27(ప్రజాక్షేత్రం):మొహరం పదవ తారీఖు(దస్వి) ఊరేగింపు వేడుకలు మండలంలోని అన్ని కులాల వార్లు శుక్రవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు కన్నుల పండువగా సాగింది. బజాభజంత్రిల మధ్య భక్తులు నృత్యలు చేస్తూ ముందుకు సాగగా కులామతాలకు అతితంగా మహిళలు పెద్దఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి మహిళలు ఇమామ్ ఖాసీం పీర్ల వద్ద బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. రాజు స్వామి పీర్లు పట్టే వద్ద భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమలో ఖదీర్ భాయ్ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనిస్ స్ఐ లావు కుమార్, దగ్గరుండి ఎలాంటి అవంచానియ సంఘటనలు లేకుండా పండుగను శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. జాహిరాబాద్ రూరల్ సబ్ ఇన్స్ పెక్టర్ రాజేందర్ రెడ్డి తమ బృందం ద్వారా ఎలాంటి గోడవలు లేకుండా చూశారు. గత ఐదు రోజుల క్రితం పంచ్వి తో మొదలైన మొహరం వేడుకలు శుక్రవారం నాడు దస్వి తో ముగిసింది. మహంకాళీ అమ్మ వారి దేవాలయం నుండి బయలుదేరి గడి లో స్వామి రాజు పీర్లు చేకున్నాయి కౌన్సిలర్ ఖదీర్ భాయ్ దగ్గరుండి అన్ని చూసుకున్నారు. మొహరం నెల త్యాగానికి ప్రతీకగా భావిస్తు పెద్దఎత్తున భక్తులకు బెల్లం షర్బత్, పాల షార్బత్ పంపిణి చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ లో గల కాన్సిలర్లు మహేష్ కుమార్, నిజాం, నామా రవికిరణ్, వకీలు చౌహాన్, మరియు జాకీర్ ఖాన్ జహీరాబాద్ నలూ మూలాల ప్రజలు, పెద్ద మొత్తంలో చేరుకున్నారు. కాంగ్రెస్ మరియు బిఆస్ఎస్ కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని చెడు కు తలవంచని హాసన్ (ఆస)గారి త్యాగానికి గుర్తుగా పండుగను ముగింపు పలికారు. భారత్ నగర కౌన్సిలర్ ఖదీర్ భాయ్ మాట్లాడుతూ జహీరాబాద్ లో శాంతిని కోరుకుంటున్నాం గంగ జమున తహెజీబ్ ను ఎల్లపుడు కాపాడుతామని చెప్పుకొచ్చారు. అదే విధంగా నిజాం భాయ్ కౌన్సిలర్ మాట్లాడుతూ ఆయనకూడా హిందూ ముస్లిం ఏక్తా నారా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular