📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

📰 Generate e-Paper Clip

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

12 మంది అరెస్ట్.. నగదు, పేకాట కట్టలు స్వాధీనం

కీసర, జూలై 20(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్జీకే డబుల్ బెడ్‌రూమ్ ఫేజ్-1లోని బ్లాక్ నెం.1, ఐదో అంతస్తు, గది నెం.501లో ఆదివారం దాడి నిర్వహించారు.దాడి సమయంలో నగదు పందెంతో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎం.జీ. బేగ్ జూదం నిర్వహిస్తున్నట్లు, ఎం.డి. అమీరుద్దీన్ అతనికి సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ.16,900 నగదు, 19 పేకాట కట్టలు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కీసర పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular