📄 ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వరకట్నం వేధింపుల కేసు కొట్టివేత

వరకట్నం వేధింపుల కేసు కొట్టివేత

📰 Generate e-Paper Clip

భద్రాచలం, జూలై 25(ప్రజాక్షేత్రం):చర్ల మండలం, చర్ల గ్రామంలో 2014సం.లో దోమల రాజశేఖర్ మరియు అతని కుటుంబ సభ్యులపై రాజశేఖర్ భార్య అయిన దోమల శారద చర్ల పోలీస్ స్టేషన్ లో పెట్టిన 498-A కేసును భద్రాచలం అదనపు జ్యూడిషియల్ ప్రధమశ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎ. దుర్గాభవాని కొట్టివేసారు.

వరకట్నం వేధింపుల కేసు కొట్టివేత

కేసు నేపథ్యం:

2014 సం.లో చర్ల గ్రామస్తుడు దోమల రాజశేఖర్ మరియు అతని కుటుంబ సభ్యులపై రాజశేఖర్ భార్య శారద చర్ల పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు (498-A) పెట్టారు. చర్ల పోలీసులు 498-A, సెక్షన్ 3,4 వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కోర్టు తీర్పు:

దాదాపు 13 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం, కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి ఎ. దుర్గాభవాని, నిందితులపై ఆరోపణలు రుజువు కాలేదని పేర్కొంటూ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

నిందితుల తరపున ప్రముఖ న్యాయవాది పామరాజు తిరుమలరావు వాదించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular