📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణసూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

📰 Generate e-Paper Clip

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

సూర్యాపేట ఆగస్టు 26(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.! ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్‌ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్‌లో మొత్తం 42 మంది ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్‌ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, క్షతగాత్రుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular