
1.960 కిలోల గంజాయి పట్టివేత
ఘట్కేసర్, ఆగస్టు 26(ప్రజా క్షేత్రం): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని ఘట్కేసర్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్ఎఫ్సీ నగర్లోని ఎస్పీ శ్రీనివాస కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాధవ్ నిఖిల్ (23)ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద 1.960 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐలు ఎం.సంగీత్రెడ్డి, వి.నందినితో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

