📄 ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeతెలంగాణఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన

📰 Generate e-Paper Clip

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన

  • రెండు రోజుల్లో రెండు చోట్ల పైకప్పు పెచ్చులూడిపాటు
  • ఆరోగ్యశ్రీ వార్డులో 8 మందికి గాయాలు

వరంగల్‌ సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు, సిబ్బందిలో భయాందోళన నెలకొంది. ఈ ఘటనలు ఇప్పుడు రాజకీయ రగడకు దారితీశాయి. రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్‌ పెచ్చులు ఊడిపడటంతో రోగులు, సిబ్బంది, సహాయకులు కలిపి 8 మంది గాయపడ్డారు. ఘటన మరువకముందే మంగళవారం ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎంజీఎంకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మార్చురీ వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో దాస్యం వినయ్‌ భాస్కర్‌ అస్వస్థతకు గురైనట్లు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. మరోవైపు సీపీఎం ఆధ్వర్యంలో ఎంజీఎం ఎదుట బైఠాయింపు, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోతన రోడ్‌ జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular