📄 ePaper
Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeజాతియంపెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు

పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు

📰 Generate e-Paper Clip

పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు

నేషనల్ బ్యూరో మే 24(ప్రజాక్షేత్రం):ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. 90 ఏళ్ల వయసున్న అత్తను వీపుపై మోసుకుంటూ ఓ మహిళ ఎండలో అడవులు, రాతి మార్గాలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్న దృశ్యాలు విక్రమ్-బేతాళ కథలను గుర్తుకు తెస్తున్నాయి. సర్గుజా జిల్లాలోని మైన్‌పాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుఖ్మానియా బాయి అనే మహిళ తన 90 ఏళ్ల అత్తకు పింఛను డబ్బులు ఇప్పించడం కోసం ఆమెను తన వీపుపై మోస్తూ దాదాపు 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు తీసుకెళ్లింది. ఈ ప్రాంతంలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక అవసరాల కోసం కూడా ప్రజలు ఇలాగే కాలినడకన ప్రమాదకర మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. పింఛను డబ్బులు లబ్ధిదారులకు అందజేయాలంటే వారు తప్పనిసరిగా బ్యాంకుకు వచ్చి వేలిముద్రలు వేయాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగానే సుఖ్మానియా బాయి గత కొన్ని నెలలుగా ఇదే విధంగా తన అత్తను బ్యాంకుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో తీస్తున్న వ్యక్తి.. ఇంత కష్టపడి ఎందుకు మోసుకెళ్తున్నావని స్థానిక భాషలో అడగగా సుఖ్మానియా బాయి తన ఆవేదనను వెళ్లగక్కింది. “బ్యాంకుకు స్వయంగా తీసుకెళ్తేనే పింఛను డబ్బులు ఇస్తున్నారు. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. అడవులు, వాగులు దాటుకుంటూ వెళ్లాలి. నెలనెలా వచ్చే రూ.1500 కోసం ఈ కష్టం తప్పడం లేదు” అని ఆమె వివరించింది. గతంలో పింఛను డబ్బులు స్థానికంగానే అందేవని, కానీ ఇప్పుడు ఈ కష్టాలు పడాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. డిజిటల్ ఇండియా, ఇంటి వద్దకే సేవలు అంటూ ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కనీస సంక్షేమ ఫలాలు అందుకోవడం కూడా ఎంత కష్టతరంగా మారిందో ఈ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login