📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణబోనం ఎత్తిన వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బోనం ఎత్తిన వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బోనం ఎత్తిన వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ జులై 19(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ పట్టణం నందు ఆషాఢ మాస సందర్భంగా పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీ శ్రీ జోడ్ కనకదుర్గా దేవి మందిరము బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, అనంతరం దుర్గా మాత గుడిలో అమ్మ వారిని దర్శించుకుని ఎలినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించేలా చల్లగా చూడాలని అమ్మవారిని భక్తితో ప్రార్థించిన పోచారం ఈ సందర్భంగా ఆశాడమాస బోనాల పండుగ సందర్భంగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular