- ఎమర్జెన్సీ పిల్’పై కేంద్రం కీలక ప్రతిపాదన.
- రెగ్యులర్‌గా వాడొద్దంటూ స్పష్టమైన హెచ్చరిక..!!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):గర్భనిరోధక మాత్రల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రెగ్నెన్సీ కంట్రోల్ పిల్ ‘లెవోనార్జెస్ట్రెల్’ 0.75 ఎంజీ/1.5 ఎంజీ ప్యాక్‌పై తప్పనిసరిగా వార్నింగ్ లేబుల్ ముద్రించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ మాత్రను వినియోగించాలని, రెగ్యులర్‌గా ఉపయోగించకూడదని ప్యాక్‌పై స్పష్టంగా ముద్రించాలని ప్రతిపాదనలో పేర్కొంది. అలాగే ఈ మాత్ర అబార్షన్ మాత్ర కాదనే విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. మాత్ర వినియోగంతో సంభవించే సైడ్ ఎఫెక్ట్స్, అవసరమైన జాగ్రత్తలు కూడా ప్యాక్‌పై పేర్కొనాలని కేంద్రం ప్రతిపాదించింది.
అత్యవసర వినియోగమే.. రెగ్యులర్ వాడకం వద్దు.!!
అబార్షన్ పిల్ కాదు.. సైడ్ ఎఫెక్ట్స్‌పై అవగాహన తప్పనిసరి! వినియోగదారులు గర్భనిరోధక మాత్రల విషయంలో సరైన అవగాహనతో వ్యవహరించేలా ప్యాకేజింగ్‌పైనే కీలక హెచ్చరికలను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

