📄 ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeతెలంగాణవయసు చిన్నది సహాయాలు పెద్దవి

వయసు చిన్నది సహాయాలు పెద్దవి

📰 Generate e-Paper Clip

వయసు చిన్నది సహాయాలు పెద్దవి

  • చదువుతున్న రోజులు నుండే పలు సేవా కార్యక్రమాలు.
  • ఎన్నారై బెల్లంకొండ రవి పై స్పెషల్ కథనం.

అనంతగిరి సెప్టెంబర్ 24(ప్రజాక్షేత్రం):తాను పుట్టి పెరిగిన ఊరుకి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగిన ఓ వ్యక్తి మన ఎన్నారై బెల్లంకొండ రవి, ఇప్పుడు గ్రామ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి రంగాల్లో ఆయన చేసిన సేవలు గ్రామ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. గ్రామ సమస్యలను దగ్గరుండి తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ఆయన కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య, రహదారుల కొరత, నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు వంటి అంశాలపై దృష్టి సారించిన ఆయన, స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. పాఠశాలల్లో అవసరమైన వస్తువుల పంపిణీ, వైద్య శిబిరాల ఏర్పాటు, పేద కుటుంబాలకు సహాయం కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఆయన సేవలు ఒక్కో కుటుంబానికి మాత్రమే కాకుండా, మొత్తం గ్రామానికే అందిస్తున్నాయి. గ్రామ యువతను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ఆయన క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. “మన ఊరు మన బాధ్యత” అనే భావనతో ముందుకు వెళ్తూ, సమాజంలో ఐక్యతను పెంచే పనులు చేస్తున్నారు. అధికారుల సహకారం, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి.

చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలు
మట్టపల్లి రామకోటయ్య

ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తులు గ్రామాలకు నిజమైన బలం అని, వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి, సమాజ సంక్షేమానికే అంకితమవడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. గ్రామాభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదు, ప్రజల జీవితాల్లో నమ్మకం నింపడం అని ఆయన చూపిస్తున్న మార్గం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular